కుటుంబ నేపద్యం

పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో మాజీ మంత్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి, ప్రమీలా దేవి దంపతులకు ప్రధమ సంతానంగా 14-12-1967వ తేదీన నరేంద్ర కుమార్ జన్మించారు. ఆయన తరువాత సోదరుడు రవికుమార్, సోదరి రాధిక జన్మించారు. నరేంద్ర కుమార్ ప్రాధమిక విద్యాభ్యాసం స్వగ్రామం చింతలపూడిలో,  హైస్కూలు విద్య నిడుబ్రోలు, అనంతవరప్పాడు జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో సాగింది. ఇంటర్మీడియట్ విద్యను విజయవాడ లయోలా కళాశాలలో, ఇంజనీరింగ్ విద్యను కర్ణాటక రాష్ట్రంలోని చిత్ర దుర్గలో పూర్తి చేశారు. తల్లిదండ్రులు కోరిక మీదట కలెక్టరుగా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో 1989లో హైదరాబాద్లో  సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతూ మరి కొద్ది రోజుల్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉన్న తరుణంలో తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించటం వలన అనివార్య పరిస్థితులలో నరేంద్రకుమార్ రాజకీయ  రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. 1992వ సంవత్సరంలో జ్యోతిర్మయిని నరేంద్రకుమార్ పరిణయమాడారు. వీరికి వీర వైష్ణవి, నాగసాయి వైదీప్తి అనే ఇరువురు కుమార్తెలు.


READ MORE MORE PHOTOS

రాజకీయ నేపద్యం

24-01-1994న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రైతు సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించే క్రమంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన మాజీ మంత్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి వారసునిగా నరేంద్ర కుమార్ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. తండ్రి వదిలి వెళ్ళిన అశేష ప్రజాభిమానంతో 16-02-1999న సంగం డేయిరి ఛైర్మన్ పదవితో తొలిసారిగా నరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేను వెంటనే 16-05-1994న జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వపక్షంలోనే పలువురితో పోరాటం సాగించి పొన్నూరు టిడిపి అభ్యర్ధిత్వాన్ని సాధించారు. ప్రజలు అఖండ మేజార్టితో అసెంబ్లీలో ఎమ్మేల్యేగా నరేంద్ర కుమార్ అడుగు పెట్టారు. అచిరకాలంలోనే తండ్రి వారసత్వం ముద్రను అధిగమించి తనదైన వాణిబాణితో పొన్నూరుతో పాటు సంగం డేయిరిని ప్రగతి బాట పట్టించారు. స్వపక్షం, విపక్షం నుంచి వచ్చిన ఎన్నో సవాళ్ళను అధిగమించి పరిణితి కలిగిన రాజకీయ నాయకుడిగా నరేంద్ర కుమార్ తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 


READ MORE MORE PHOTOS

సంగంతో అనుబంధం

జిల్లాలో పాడిపరిశ్రమలో క్షీరవిప్లవాన్ని సృష్టించిన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి వారసునిగా సంగండెయిరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర కుమార్ అచిరకాలంలోనే సంగండెయిరీని జిల్లాలోనే కాకుండా దక్షిణ భారత దేశంలో ప్రధమ స్థానంలో నిలిపారు. 16-02-1994న తొలిసారిగా చైర్మన్ హోదాలో డెయిరీలో అడుగు పెట్టి రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించారు. ఆవెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 8 నెలల స్వల్ప కాలంలోనే సంగం బాధ్యతలను వదులుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. 23-09-2010న తిరిగి సంగం డెయిరీ చైర్మన్ గా నరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు పాల ఉత్పత్తి దారుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న పాడి రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందడుగు వేశారు. 


READ MORE MORE PHOTOS

Photo Gallery

Testimonials

Write To Me